నవతెలంగాణ- వలిగొండ రూరల్ : మండలంలోని గోళ్లేపెళ్ళికి చెందిన సర్పంచ్ గూడూరు శివశాంత్ రెడ్డి మాతృ మూర్తి సదాలక్ష్మమ్మ ఇటీవల అనారోగ్యానికి గురై మృతిచెందడంతో సోమవారం వారి దశదిన కర్మ సందర్భముగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి లు పాల్గొని ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఫైళ్ల రాజవర్ధన్ రెడ్డి, చెరుకు శివయ్య, తుమ్మల వెంకట్ రెడ్డి, కాటపెళ్లి వెంకలు తదితరులు పాల్గొన్నారు.