చౌట్ పల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న  ప్రముఖులు

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని చౌట్ పల్లిలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల్లో పలువురు  ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామానికే  చెందిన  రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకోగా, బాల్కొండ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.