నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన మహాలక్ష్మి దిష్టికుంభం, శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర మహోత్సవంలో కార్యక్రమంలో ఆదివారం ప్రభుత్వ విప్ ,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్మెడ లక్ష్మీనరసింహారావు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తోపాటు పుర ప్రముఖులను ఆలయ అర్చకులు, నిర్వాహకులు వారిని ఘన స్వాగతం పలికారు, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయానికి విచ్చేసిన ప్రముఖులను శాలువులతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. లోక కల్యాణం జగరగలని వారు చేస్తున్న కార్యక్రమం అభినందనీయం అన్నారు.ఆషాడమాసంలో పల్లె నుంచి మొదలకొని పట్నం వరకు బోనాలు సమర్పించడం మన తెలంగాణ సంప్రదాయనికి ప్రతీక అన్నారు. ఆధ్యాత్మిక చింతనలో,సామాజిక సేవలో వారు చేస్తున్న సేవలను కొనియాడారు.అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి రైతులు పాడి పంట సమృద్ధిగా వృద్ధి చెందాలని కోరుకున్నట్లు, అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయ కమిటీ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.