సీఈఐఆర్‌ యాప్‌ ద్వారా సెల్‌ ఫోన్‌ పట్టివేత ఎస్సై రమేష్‌ కుమార్‌

నవతెలంగాణ-కొడంగల్‌
చోరికి గురైన సెల్‌ ఫోన్‌ను సీఈఐఆర్‌ యాప్‌ ద్వారా గుర్తించి దుండగుల చేతి నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసు కుని బాధితుడికి అందించినట్లు ఎస్సై రమేష్‌ కుమార్‌ తెలి పారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్‌ కుమార్‌ మాట్లాడు తూ దౌల్తాబాద్‌ మండలం బాలం పేట గ్రామానికి చెందిన కొంతం బాలకృష్ణ సెల్‌ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశారన్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బాలకృష్ణ ఫిర్యాదు చేయడంతో సెల్‌ ఫోన్‌ వివరాలను సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌ నందు ఐఎంఐ నెంబరు, మిగతా వివరాలు నమోదు చేసి రిజిస్టరైన ఒక ఐడీ ద్వారా మొబైల్‌ను ట్రాక్‌ చేయడంతో సెల్‌ఫోన్‌ 24 గంటల్లో చోరీకి గురైన సెల్‌ఫోన్‌ను పట్టుకు న్నామన్నారు. బుధవారం ఎస్సై రమేష్‌ కుమార్‌ బాధితు డికి అందించామన్నారు. సెల్‌ఫోన్‌ పడిపోయిన, చోరీకి గురైన వివరాలను తప్పనిసరిగా సీఐఆర్‌ వెబ్‌ సైట్‌ లో నమోదు చేసి పోలీసు అధికారులను సంప్రదించాలని ఈ వెబ్సైట్‌ ద్వారా తిరిగి ఫోన్‌ను పొందవచ్చన్నారు, సెల్‌ ఫోన్‌ ను అందుకున్న బాధితుడు బాలకృష్ణ ఎస్సై రమేష్‌ కుమార్‌ కు పోలీస్‌ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.