
మండల కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రంపై శనివారం సిమెంటు రోడ్డు పనులను ప్రారంభమయ్యాయి. స్థానిక తాజా మాజీ సర్పంచ్ గడ్డం స్వామి తన సొంత ఖర్చుతో గుట్టపై సిమెంట్ రోడ్డు పనులను చేపట్టారు. శ్రీగిరి క్షేత్రం పై ఉన్న బ్రహ్మంగారి గుడి, సరస్వతి ఆలయం, శివాలయం చుట్టూ భక్తుల సౌకర్యార్థం సొంత ఖర్చుతో గడ్డం స్వామి సిమెంటు రోడ్లతో పాటు ఫ్లోరింగ్ పనులను చేయిస్తున్నారు. ఈనెల 12వ తేదీ పౌర్ణమి రోజున జరగనున్న బ్రహ్మంగారి జాతర, అన్నవితరణ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని గుట్ట పైకి వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో మాజీ సర్పంచ్ గడ్డం స్వామి సిమెంటు రోడ్లు, ఫ్లోరింగ్ పనులు చేయిస్తున్నారు. శ్రీగిరి క్షేత్రంపై సిమెంటు పనులతో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్న గడ్డం స్వామికి స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.