– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్‌కు నిధుల కేటాయింపుల్లో కేంద్రం అన్యాయం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంపై ప్రధాని మోడీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని ఆరోపించారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ అంటూనే తెలంగాణను దూరం పెడుతు న్నార న్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అడిగి నప్పటికీ ప్రధాని పట్టించు కోల ేదని చెప్పారు. ఇతర రాష్ట్రాలపై ఎనలేని ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్న ఉద్దే శంతో గెలిచే పార్టీ ఎంపీలు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన ప్రజలు ఈ సారి బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. అయినా గతంలో కన్నా నిధుల్లో కోతలు పెట్టారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైద రాబాద్ మెట్రోను విస్మరించి మిగతా రాష్ట్రా ల్లోని మెట్రో ప్రాజెక్టుల కు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని కేటీఆర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు రూ.5, 134.99 కోట్లు, మహా రాష్ట్రకు రూ.4,109 కోట్లు, గుజరాత్‌కు రూ. 3,777.85 కోట్లు, ఢిల్లీకి రూ.3,520 కోట్లు, కర్ణాటకకు రూ.1880.14 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.1,638.02 కోట్లు, బీహార్‌కు రూ. 1,400.75 కోట్లు, తమిళనాడుకు రూ.713 కోట్లు, కేరళకు రూ.146.74 కోట్లు, ఢిల్లీ-ఘజి యాబాద్ రాపిడ్ రైల్ ప్రాజెక్టుకుకు రూ. 1,106.65 కోట్లు కేటాయించారని వెల్లడిం చారు. గత పదేండ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్టులకు వివిధ రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ ఇవ్వలేదని ఆరోపించారు.