మణిపూర్‌ హింసాకాండకు కేంద్రం బాధ్యత వహించాలి

– మండలి డిప్యూటీ చైర్మెన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మణిపూర్‌లోని జరిగి అమానుష హింసాకాండకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మెన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌ తెలిపారు. సాహిత్య అకాడమి చైర్మెన్‌ జూలూరు గౌరీశంకర్‌ సంపాదకత్వంలో వెలువరించిన ‘మణిపూర్‌ మంటలు’ పుస్తకాన్ని ఆయన శుక్రవారం మండలి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభిన్న కులాలు, మతాల, జాతుల సమాహారమైన విశాల భారతదేశాన్ని కుల,మతాల పేరుతో విభజించటం ద్వారా గద్దెనెక్కేందుకు ప్రయత్నించేవారి ఆటలను తిప్పికొట్టాలని సూచించారు. మతసామరస్యం దేశానికి రక్షణగా నిలుస్తుందని తెలిపారు. మణిపూర్‌ మంటలు లాంటి గాయాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ తరం పుస్తకాలను అధ్యయనం చేయాలని సూచించారు.