– సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు కె. రాజిరెడ్డి
నవతెలంగాణ-దోమ
జమ్ము పాకిస్తాన్ సరిహద్దుల్లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైన వీర జవాన్లకు బుధవారం రాత్రి మండల కేంద్రంలో ఘనంగా శ్రద్దంజలి కార్యక్రమం నిర్వహించారు. మాజీ సైనికులు గురు నాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల మాజీ సర్పంచ్ కె. రాజిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలని,అమరుల కుటుంబంకు అన్ని విధాలా ఆదుకో వాలని కోరారు. ప్రతి ఒక్కరికీ దేశానికి కాపలా కాస్తున్న సైనికుల కు అన్ని రకాల క్షేమము ఉండేలా ప్రభుత్వాలు చూడాలన్నారు కొవ్వ త్తులతో మౌనం పాటించారు జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్ర మం లో మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, రాఘవేందర్ రెడ్డి, బంగ్లాయాదయ్య గౌ డ్, వెంకటయ్య గౌడ్, యువకులు తదితరులున్నారు.