ఉపాధి హామీ పథకం తొలగింపుకు కేంద్రం కుట్ర

– ఉపాధి హామీ బోధన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మెగావత్ సరిదాస్..

నవతెలంగాణ – రెంజల్ 
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం దశలవారీగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యోషిస్తుందని ఉపాధి హామీ బోధన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మెగావత్రి హదాసు స్పష్టం చేశారు. సోమవారం రెంజల్ మండలంలోని కూనేపల్లి, వీరన్న గుట్ట తండా, గండిగుట్ట తండా గ్రామాలలో ఆయన పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల గురించి వివరించారు. మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు, రెంజల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోబిన్ ఖాన్ అనుమతితో మండలంలో పర్యటించినట్లు ఆయన పేర్కొన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ప్రవేశపెట్టగా దానిని దశలవారీగా తొలగించడానికి బిజెపి ప్రభుత్వం కొత్త పన్నుతోందని ఆయన స్పష్టం చేశారు. గత 60 సంవత్సరాల లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏర్పాటు చేయగా, బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తుందని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.