నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో నిర్వహించిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఏఐ ఎఫ్ డిబ్ల్యూ జిల్లా జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్ నీలా అధ్యక్షతన నిర్వహించరు. ఈ జనరల్ బాడీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి కుంభం సుకన్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయని, జరుగుతున్న అత్యాచారాలను, ఆత్మహత్యలను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయన్నారు. మహిళల భద్రతకు ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన మహిళలకు అయితే ఒక న్యాయం, ఉన్నత వర్గాలకు చెందిన వారికి ఒక న్యాయం చేయడం సరికాదన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు సంఘటితమై ఆడవాళ్ళ పైన జరుగుతున్న దాడులను కలిసికట్టుగా ఉండి పోరాడి మహిళా చట్టాలను సాధించాలని అన్నారు. ఈ సమావేశంలో నూతన కమిటీని 15 మందితో ఎన్నుకోవడం జరిగిందన్నారు. జిల్లా కన్వీనర్ గా మాలోత్ అర్చన, జిల్లాకు కొకన్వీనర్ గా నాగమణి, రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా శివాని, జిల్లా కమిటీ సభ్యులుగా సుజాత, లీల, పద్మ, అనార్కలి, మంజుల, బట్టు లక్ష్మి, సత్యవా తదితరులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్ పాల్గొన్నారు.