కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేయాలి

– 23న జరిగే ఎస్‌టీఎఫ్‌ఐ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
– టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ వెంకటరత్నం
నవతెలంగాణ -వికారాబాద్‌ ప్రతినిధి
ఎస్‌టీఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి సదస్సు 23న ప్రపంచ బ్యాంకు ఆదేశిత పెన్షన్‌ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వము అమలుపరచుకున్న జాతీయ పెన్షన్‌ పథకాన్ని వెంటనే ర ద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 23న హైదరా బాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫె డరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌ ) జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ వెం కటరత్నం, ఎల్‌ఐయు డివిజన్‌ అధ్యక్షుడు జంగయ్య సోమ వారం ఎల్‌ఐసి కార్యాలయం ముందు సీపీఎస్‌ రద్దు చే యాలని డిమాండ్‌ చేస్తూ గోడ పత్రికను విడుదల చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా మారిందని చందాలతో కూడిన జాతీయ పెన్షన్‌ విధా నంలో కనీసం పెన్షన్‌ గ్యారెంటీ లేదని సీపీఎస్‌ రద్దు చే యాలని 18 సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా కార్మిక ఉద్యో గ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్న కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం జాతీయ పెన్షన్‌ విధా నాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తున్నా రని బీజేపీ ఇతర రాష్ట్రాలలో దీన్ని అమలుపరిస్తే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఎస్‌ లోకి వెళ్లడం తప్ప తిరిగి వెనక్కి తిరిగే అధికారం లేదని విధంగా మాట్లాడుతూ రాష్ట్రాల ప్రభుత్వాలను భ యాందోళనకు గురిచేస్తూ అమలుపరచకుండ అవరోధా లు కలిగిస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎల్‌ఐ యు డివిజనల్‌ ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ సత్య నారాయణ టీఎస్‌యుటిఎఫ్‌ వికారాబాద్‌ జిల్లా కార్యదర్శిలు ఎన్‌ బాబు రావు పవన్‌ కుమార్‌ ఎంరత్నం ఎంవినోద్‌ ఎల్‌ఐసి నాయ కులు తదితరులు పాల్గొన్నారు