కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాలి..

– గ్రామ పంచాయాతీ కార్యదర్శుల డిమాండ్..
– ఎంపీడీఓకు వినతి ప్రతం అందజేత..
నవతెలంగాణ – జుక్కల్
కేంద్ర, రాష్ట్ర సీఏఫ్ సి, ఎస్ఎఫ్ సి నిధులతో పాటు ఎంపిడబ్ల్యు నిధులు వెంటనే విడుదల చేయాలని  డిమాండ్ చేస్తు శనివారం నాడు జుక్కల్ ఎంపిడీవో శ్రీనివాస్ కు మండలంలోని ముప్పై గ్రామపంచాయతీల సంభందించిన కార్యదర్శులు వినతి పత్రం అందించారు. ఈ సంధర్భంగా మండల కార్యదర్శుల యూనీయన్ నాయకులు మాట్లాడుతూ.. గత సంవత్సరం డిసెంబర్ మాసంలో కేంద్ర నిధులు జీపీ ఖాతాలో జమా చేసారని, అనంతరం నాటి నుండి నేటీ వరకు నయా పైసా గ్రాంటు రాలేదని అన్నారు. ఎస్ఎఫ్ సి గ్రాంటు సంవత్సరంన్నర నుండి కేటాయించలేదని, ప్రత్యేక అధికారుల పాలన నుండి పంచాయతి కార్యదర్శులు తమ స్వంత డబ్బులు వచ్చే వేతనాల నుండి పెద్ద జీపీల మెుదలు కొని చిన్న జీపీలకు లక్షలలో రూపాయలు ఖర్చు చేయడం జర్గిందని  తెలిపారు. ఎంపిడబ్ల్యు వారికి గత కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచారని, వేసవి కాలంలో కార్యదర్శులు స్వంతగా ఖర్చులు చేసి నీటీ సమస్యలు తీర్చామని పేర్కోన్నారు. ట్రాక్టర్ బిల్లులు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లు, బోరు మేాటార్ల రిపేర్లు , పారీశుద్ద్య పనులకు ఖర్చులు  చేసామని, ఇక పై తాము చేసిన ఖర్చులు వచ్చే వరకు ఎటువంటి ఆర్థిక సంభందిత పనులు నిర్వహించమని మండల కార్యదర్శుల సంఘం వారు ముక్త కంఠంతో తెలియ చేస్తున్నామని అన్నారు. ప్రభూత్వ వెంటనే జీపీ లకు సంభందించిన సీఎఫ్ సి , ఎస్ఎఫ్ సి నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతు ఎంపిడీవో ఇచ్చిన వినతి పత్రంలో పేర్కోన్నారు. ముప్పై జీపీల కార్యదర్శులు,  తదితరులు పాల్గోన్నారు.