కేంద్ర బీజేపీ ప్రభుత్వ మత రాజకీయాలను తిప్పికొట్టాలి

– ఫిబ్రవరి 16న జరిగే అఖిల భారత సమ్మెను జయప్రదం చేయండి
– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య
నవతెలంగాణ-సదాశివపేట, జిన్నారం
కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను మారుస్తూ.. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని.. బీజేపీ మత రాజకీయాలను తిప్పికొట్టాలని సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. సదాశివపేట పారి శ్రామిక ప్రాంతంలోని పెబ్స్‌ పెన్నార్‌లో ఆ కంపెనీ యూని యన్‌ అధ్యక్షులు వి.ప్రవీణ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్మికుల జనరల్‌ బాడీ సమావేశంలో మల్లేశం, జిన్నారం మండల పారిశ్రామిక ప్రాంతమైన ఖాజీపల్లిలో సీఐటీయూ క్లస్టర్‌ కార్యకర్తల సమావేశంలో రాజయ్య వేర్వేరుగా మాట్లాడతూ.. కార్పొరేట్‌, మతోన్మాద, నయా ఉదారవాద విధానాల వల్ల ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గుర్తించి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ మత రాజకీ యాలకు తెరలేపుతూ అయోధ్య రామ మందిరాన్ని ముందు కు తీసుకువచ్చిందన్నారు. మోడీ మూడోసారి అధికారం రావడం కోసం అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడని.. దీనిని ప్రజలందరూ గమనించాలన్నారు. మతోన్మాదాన్ని పెంచి పోషించడమే కాకుండా, మతాన్ని పూర్తిగా రాజకయాలకు వాడు కోవడం దారుణమైన విషయమన్నారు. దేశ ప్రధానమంత్రిగా ఉండి రాజ్యాంగాన్ని గౌరవించకుండా మత కార్యక్రమాలలో పాల్గొనడం విచారకరమన్నారు. పార్లమెంట్‌ పై జరిగిన దాడి గురించి ఎందుకు చర్చించ లేదని.. పాసులు ఇచ్చిన ఎంపీ పైన ఎందుకు చర్యలు తీసు కోలేదని ప్రశ్నించారు. అలాగే గత ఎన్నికలప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తున్నద న్నారు. విద్యుత్‌ సంస్కరణ బిల్లు, కార్మిక చట్టాల మార్పు, నేషనల్‌ మానిటైజేషన్‌, జీఎస్టీ ఇలా అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజల ఆస్తులను దోచు కొని పెట్టుబడుదారులు, కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ కట్ట బెడుతున్నదని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న ఈ మత రాజ కీయాలను తిప్పికొట్టడంలో భాగంగా దేశంలోని కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలందరినీ చైతన్యం చేయడం కోసం దేశంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాలు, (రైతు సంఘాల ఐక్యవేదిక) సంయుక్త కిసాన్‌ మోర్చా, అఖిలభారత వ్యవ సాయ కార్మిక సంఘం , అఖిల భారత కిసాన్‌ సభలు సంయుక్తంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్‌, పారిశ్రామిక బంద్‌కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. కాబట్టి జిల్లాల్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతా కార్మికులు, స్కీమ్‌ వర్కర్లు, ప్రజలు, రైతులు,కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ గ్రామీణ బంద్‌, సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెబ్స్‌ పెన్నార్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షులు వి.ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కార్మిక హక్కుల కోసం వారి సంక్షే మం కోసం జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మి కులం దరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్ర మం లో పెబ్స్‌ పెన్నార్‌ సమావేశంలో ఎంప్లాయిస్‌ యూని య న్‌ నాయకులు శ్రీనివాస్‌, నీలం మల్లేశం, రవికుమార్‌, నాగ రాజ్‌, మోహన్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, పాండురంగం, మోహన్‌ చారి, జావిద్‌, ఖాజీపల్లిలో సీఐటీయూ నాయకులు వెంక టే ష్‌, మధుసూదన్‌ రెడ్డి, శ్రీనివాస్‌, సత్తయ్య, ప్రభు, నరసిం V ాగౌడ్‌, నరేష్‌,రామకష్ణ, యూసుఫ్‌ తదితరులు పాల్గొన్నారు.