మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని కేంద్ర బడ్జెట్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మహిళల సంక్షేమాన్ని విస్మరించిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను మోడీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని తెలిపారు. సంపన వర్గాల ప్రయోజనాలే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని విమర్శించారు.