
– ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్ రూంల పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్
– వ్యయ పరిశీలకులు జి. మణిగండసామి
నవతెలంగాణ – తంగళ్ళపల్లి: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ జగదీష్ సొన్ కర్,వ్యయ పరిశీలకులు జి. మణిగండసామి అధికారులకు సూచించారు.శాసనసభ ఎన్నికల సందర్భంగా సోమవారం తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్ రూములను ఎన్నికల సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్,వ్యయ పరిశీలకులు జి. మణిగండసామి, రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్, మధు సూదన్, డిఎస్పీ ఉదయ్ రెడ్డి ల తో కలిసి పరిశీలించారు. డిసెంబర్ 3న నిర్వహించే ఓట్ల లెక్కింపు సందర్భంగా, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలలో చేపట్టిన పనుల వివరాలను సాధారణ ఎన్నికల పరిశీలకులకు రిటర్నింగ్ అధికారులు వివరించారు.ఈ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి వచ్చే ఏజెంట్లకు కానీ, అభ్యర్థులకు కానీ, ఓట్ల లెక్కింపు చేసే అధికారులకు కానీ, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. లే అవుట్ మ్యాప్ ను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద చేపడుతున్నపనులు,వసతులు,సదుపాయా లను పరిశీలించారు.ఎన్నికల సంఘం నిబంధన మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేసి భారీగా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఎలాంటి అల్లర్లు గొడవలకు పోకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను, బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.