
నవతెలంగాణ – భువనగిరి
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లో నిధులు కేటాయించే విషయంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షులు అండం సంజీవ్ రెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దృష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అండం సంజీవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపికి 8 మంది ఎంపీలు ఉన్నాగాని వారి చేతకారితనానికి నిదర్శనమని తెలిపారు. రానున్న ఎలక్షన్ లో బిజెపి కి మరియు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు బర్రె జహంగీర్ పిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ ఈరపాక నరసింహ సలావుద్దీన్ కైరం కొండ వెంకటేశ్వర్లు బర్రె నరేష్ శెట్టి బాలయ్య యాదవ్ సోమయ్య లైఫ్ అహ్మద్ బానోతు వెంకట్ నాయక్ వాసుదేవ్ కొల్లూరి రాజు పాల్గొన్నారు.