కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

– యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
కార్మికుల హక్కులను కేంద్ర  ప్రభుత్వం కాలరాస్తోందని యువైఏప్ఐ (బారత సమైక్య యువజన) అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ ఆరోపించారు. సోమవారం 139వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని  ఇప్పలపల్లి గ్రామంలో ఏఐసిటియు జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బాపు మాట్లాడారు  కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాల రాస్తుందన్నారు.కార్మికులకు వ్యతిరేకంగా మూడు లేబర్ కోడు లు  తీసుకువచ్చారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అమ్మి వేశారాని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యగా అవకాశాలు కల్పించడం, ఉపాధి కల్పించడం లో పూర్తిగా వైపల్యము చెందిందన్నారు.1886, మే 1న షికాగోలనిహే మార్కెట్లో జరిగిన పోరాటాన్ని నేడు ప్రపంచ వ్యాప్తంగా మేడేగా, కార్మికుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.షికాగో మారణకాండలో ప్రాణాలర్పించిన కార్మికులను స్పరిస్తూ శ్రామిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కార్మికులు,రైతులు,యువకులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.హమాలి సంఘాలు,భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొయ్యుర్, తాడిచెర్ల, మల్లారం,ఎడ్లపల్లి, కొండంపేట గ్రామాల్లో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హమాలి,భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.