కేంద్ర ప్రభుత్వం ఓబీసి జనగణన చేపట్టాలి..

 ఓబీసి జనగణన
ఓబీసి జనగణన

నవతెలంగాణ – సుల్తాన్ బజార్
కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఓబీసీ జనగణన చేపట్టాలని తెలంగాణ ఓబీసీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వి.దానకర్ణ చారి డిమాండ్ చేశారు. హనుమాన్ టెకీడి లోని బీసీ సాధికారత భవన్ లో తెలంగాణ ఓబీసీ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ధర్నాను నిర్వహిస్తున్నట్టు వివరించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని.. ఓబీసీలను మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు 50 శాతం రిజరేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి పెల్లి పాండు. ఏఐఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్నయ్య, తెలంగాణ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవికుమార్ ముదిరాజ్, సభ్యులు జి.మల్లేష్, వంశీ, టి.అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడు అశోక్, రామరాజు యాదవ్, సురేందర్, వెంకటేశ్, నగేష్, శ్రీనివాస్ గౌడ్, యాకయ్య గౌడ్, వెంకటేశ్వర్లు, పూర్ణ చందర్ రావు పాల్గొన్నారు.