ఆశా వర్కర్లను కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాలి

Central government should make Asha workers permanentనవతెలంగాణ – తొగుట
ఆశా వర్కర్లను కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాల ని ఆశా కార్యకర్తల మండల అధ్యక్షురాలు డి. లక్ష్మీ డిమాండ్ చేశారు. మంగళవారం తొగుట పిహెచ్స్ లో వైద్య అధికారి డాక్టర్ రాధకిషన్ కు సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా కార్యకర్తల కనీస వేతనం రూ.26 వేల చెల్లించాలన్నారు. పిఎఫ్, ఇఎస్ఐ ఉద్యోగ భద్రత  కల్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఆశాలు పది లక్షల మంది పని చేస్తు న్నారనీ పేర్కొన్నారు. గత 30 సంవత్సరాల నుండి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, 20 సంవత్సరాల నుండి ఆశాలు ఎన్ఎచ్ ఎం స్కీంలో భాగంగా పని చేస్తున్నారనీ గుర్తు చేశారు. వీరంతా మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందినవారని అన్నా రు. నిరంతరం పేద ప్రజలకు ఆరోగ్య సేవలిందిస్తు, ప్రస్తుతం ప్రజలకు వస్తున్న సీజనల్ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి అరికట్టడం లో ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆస్పత్రు ల్లో డెలివరీల సంఖ్యను పెంచడంలో ఆశాలు కీలక పాత్ర పోషిస్తున్నారని అయిన వారికి చాలి చాలని వేతనాలతో జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభ్యుత్వాలు ఇప్పటి కైన కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్య కర్తలు సజీదా, కనకవ్వ, నసీమ, భాగ్యలక్ష్మి, కృష్ణ వేణి తదితరులు ఉన్నారు.