కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య
నవతెలంగాణ-పరిగి
కేంద్ర బీజేపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపా లని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గసభ్యులు ఎం వెంకటయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయివేట్‌ సంస్థలకు వేలం పా టలో కట్టబెట్టడాన్ని వెంటనే ఆపాలని శుక్రవారం సీపీ ఐ(ఎం) ఆధ్వర్యంలో పరిగి పట్టణంలోని బస్టాండ్‌ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ..కేంద్ర బీజేపీ ప్రభుత్వం మంచిర్యాల జిల్లాలోని బొగ్గు బ్లాక్‌లను ప్రయివేట్‌ సంస్థలకు వేలం వేస్తున్నద న్నారు. సింగరేణి కంపెనీ కూడా ప్రయివేటు సంస్థలతో వేలం పాటలో పోటీపడాలని నిర్ణయించిందన్నారు. తెలం గాణలో సింగరేణి కాలరీస్‌ బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి అన్నారు. సహ జంగానే సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలి, కానీ వేలంపాట ద్వారా ప్రయివేటు సంస్థలకు అవకాశం ఇస్తున్నదన్నారు. ఇప్పటికే నాలుగు బ్లాకులను బీఆర్‌ఎస్‌ పాలనలో మోడీ ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు అప్పగించింది. మన రా ష్ట్రం నుండి బొగ్గుగనుల కంపెనీ, బొగ్గు గనులశాఖ మం త్రిగా ఉన్న కిషన్‌రెడ్డి హైదరాబాదు కేంద్రంగానే వేలంపా ట ప్రక్రియను ప్రారంభించడం అన్యాయం అన్నారు. దేశవ్యాప్తంగా 61 బొగ్గు బ్లాక్‌ లను ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడానికి వేలం వేశారన్నా రు. క్రమంగా సింగరేణి సం స్థ బలహీన పడి దానిమీద ఆధారపడినటువంటి కార్మికు లు, ప్రజలు బోగ్గుగని కార్మి కులు అన్యాయం చేస్తున్నారని అన్నారు. బీజేపీి కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలలో దేశంలోని ఎల్‌ఐసి, రైల్వే,బ్యాంకింగ్‌,ఎయిర్పోర్ట్‌, విశాఖ స్టీల్‌, వంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు ప రం చేయడం బీజేపీ అసలు స్వరూపం బయటపడు తుం దన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యు లు బుస్స చంద్రయ్య , ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కె. చంద్ర య్య,ఎల్‌ హేచ్‌ పిఎస్‌ జిల్లా అధ్యక్షులు గోవింద్‌ నాయక్‌, సీపీఐ(ఎం) నాయకులు హబీబ్‌, సత్యయ్య, శేఖర్‌ తది తరులు పాల్గొన్నారు.