– ఆరోగ్య శ్రీ సేవలపై పరిశీలన
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర ప్రభుత్వ నేషనల్ హెల్త్ అథారిటీ బృందం గురువారం తెలంగాణ అరోగ్య శ్రీ సీఈఓ ఎన్‌ఆర్ విశాలాచ్చితో కలిసి హైదరాబాద్ నిమ్స్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొ. నగరి బీరప్ప వారిని ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్‌కు తీసుకెళ్ళి అక్కడ రోగులకు అరోగ్య శ్రీ ద్వారా అందిస్తున్న సేవలకు వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వివిధ విభాగాల్లో ఆరోగ్య శ్రీ ద్వారా రోగులకు అందుతున్న సేవల గురించి బోర్డు రూమ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిమ్స్ డైరెక్టర్ క్లుప్తంగా వారికి వివరించారు. బృందంలో నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ దీప్తి గౌర్ ముఖర్జీ, అడిషనల్ సీఈఓ బసంత్ గార్గ్ ఉన్నారు. పరిశీలించిన వారితో పాటు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, డీన్ రాజశేఖర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ లక్ష్మీ భాస్కర్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ స్వర్ణలత, వివిధ శాఖాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.