– అధికారుల లేమి..
– పర్యవేక్షణ శూన్యం..
– కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణ సుందరీకరణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే ది ఆ పనులను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. అశ్వారావుపేట – సత్తుపల్లి రోడ్ లో ప్రస్తుతం డ్రైనేజీ పనులు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం పడిన వర్షానికి ఏకే గ్రాండ్ సమీపంలోని వంతెన సమీపంలో 3 మీటర్లు మేర కొత్తగా నిర్మించిన డ్రైనేజీ శిధిలం అయింది.దీంతో మంగళవారం తిరిగి నిర్మిస్తున్నారు. ఈ సంఘటనతో నాసిరకం పనులని తేలిపోయింది. ఈ సెంట్రల్ లైటింగ్ పనులకు 2023 జూన్ లో 3 వ తేదీన నాటి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు లాంచనంగా శంకుస్థాపన చేసారు. ఖమ్మం – అశ్వారావుపేట 325 బి.బి జాతీయ రహదారిలో 119/0 (పేరాయిగూడెం) నుండి 121/0 జంగారెడ్డిగూడెం రోడ్లో కాకతీయ గేట్ వరకు 2 కి.మీ మేర రూ.9 కోట్లు, అశ్వారావుపేట- భూర్గంపాడు రోడ్లో 0/0 (పోలీస్ స్టేషన్) నుండి 1/5 అరకిలోమీటరు వరకు రూ.1 కోటి 35 లక్షల వ్యయంతో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం,సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి. ప్రారంభించే రెండో ఏడాది కావచ్చిన ఈ పనులు ఒక కొలిక్కి రాలేదు. ఈ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఒకరు అయితే నేడు పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ మరొకరు. కాంగ్రెస్ లో స్థానికంగా పరపతి ఉన్న ఓ నాయకుడు కనుసన్నల్లో ఈ పనులు జరుగుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నాయకుడి అనుచరులు కొందరు ఈ పనులు పర్యవేక్షణ చేస్తున్నారని వాదన వినిపిస్తుంది.ఇసుక సైతం స్థానిక వాగుల నుండి సేకరించింది గా ఋజువులు ఉన్నాయి.ఎలా అంటే ఏ ఇసుక వాహనాన్ని అధికారులు అడ్డుకున్నా ఫలానా నాయకుడు,ఫలానా పనికి తరలిస్తున్నట్లు జవాబు రావడం దీనికి ఋజువులు. ఇక పోతే శాఖా పరంగా ఆర్ అండ్ బీ లో సిబ్బంది కొరత వేధిస్తుంది.గత బదిలీల్లో ఇక్కడ డీఈఈ ని బదిలీ చేసి తిరిగి ఇక్కడికే పోస్టింగ్ ఇచ్చారు.క్షేత్ర స్థాయి సిబ్బంది ఒకరు పదవీ విరమణ పొందారు.దీంతో ఈ పనులను కాంట్రాక్టర్ గుమాస్తా లు,స్థానిక నాయకుడి అనుచరులు పర్యవేక్షించడం పరిపాటిగా మారింది అని పట్టణ వాసులు గుస గుసలాడుతున్నారు. ఈ విషయం అయి డీఈఈ శ్రీనివాస్ కు ఫోన్ చేస్తే స్పందించలేదు.కొత్తగా విధుల్లో చేరిన ఏఈఈ రాకేష్ చౌదరిని వివరణ కోరగా నేను ఇంకా ఏ పనులు పర్యవేక్షించడం లేదని తెలిపారు.