– యువ కవిని సన్మానించిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా నాయకులు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
2024 గ్రహీత యువ కవి రమేష్ కార్తీక్ నాయక్ కు కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కారం అందుకున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం లోని వివేక్ నగర్ తండా వాసి బంజారా యువ కవి రమేష్ కార్తీక్ నాయక్ ని జిల్లా అధ్యక్షులు చంద్రు నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ నాయక్ గార్ల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా నాయకులతో కలిసి సన్మానించడం జరిగింది. రమేష్ కార్తీక్ నాయక్ హైదరాబాద్ నుండి వచ్చిన విషయం తెలిసి జిల్లా బంజారా నాయకులు ఆయన గ్రామానికి వెళ్లి సన్మానించడం జరిగింది. చిన్న వయసులోనే 4 పుస్తకాలు రాయడం జరిగింది.(1)బల్దేర్ బండి- 2018.(2)డావలో -2021.(3)కేసులా -2022.(4)చక్ మక్-2023 ఈలా 4 పుస్తకాలు రాయడం జరిగింది. రమేష్ కార్తీక్ నాయక్ సన్మానం సందర్భంగా జిల్లా అధ్యక్షులు చంద్రు నాయక్ మాట్లాడుతూ.. డావలో పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కారం అవార్డు రావడం మన జిల్లా,రాష్ట్ర బంజారా సమాజం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. రమేష్ కార్తీక్ నాయక్ కు ఇంకా ఇలాంటి అవార్డు తెచ్చి బంజారా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని కోరారు. బంజారా యువ కవి రమేష్ కార్తీక్ నాయక్ కు జిల్లా బంజారా సేవా సంఘం నీకు అండగా ఉంటుందని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో శ్రీ కొర్ర గంగాధర్ నాయక్ స్థానిక మండల బంజారా అధ్యక్షులు,విట్టల్ రాథోడ్ జిల్లా కార్యదర్శి,రాజు సదర్ నాయక్,జితేందర్ నాయక్ మాజీ వైస్ ఎంపీపీ జక్రాన్ పల్లి,మదన్ నాయక్ మండల ప్రధాన కార్యదర్శి డిచ్పల్లి,గ్రామ నాయకులు గమ్య,రామ్సింగ్,శంకర్,రాములు,లోక్యా,మాతృ, రామ్జి ,రవి మోజిరామ్, రమేష్ కార్తీక్ నాయక్ తండ్రి మోజిరామ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.