నవతెలంగాణ – ఆర్మూర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని మాదిగ సంఘాల యూనిటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న అన్నారు. మాదిగ దండోరా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం వంద డప్పులతో పాత బస్టాండ్ నుండి ర్యాలీగా బయలు దేరి కొత్త బస్టాండ్ మీదుగా. అంబేద్కర్ చౌరస్తాలో మాదిగ అమర వీరులకు జోహార్లు అర్పిస్తూ డప్పు వాయిద్యాల తో మాధిగల ఐక్యతను చాటుతు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎస్సి వర్జీకరణ, డప్పులు కొట్టే మాదిగలకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994 … ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జులై 7 వ తేదీన మొదటగా మాదిగ దండోరా ఆవిర్భవించిందని అది కాలక్రమేణా ఎం ఆర్ పి ఎస్ గా అవతరించి ఒక మాదిగలకే కాదు సబ్బండ వర్ణాల వారికి ఎంతో మేలు చేసిందని, ఒక కుల సంఘం కులాలకు సంబంధం లేకుండ అన్ని జాతులకు, మతాలకు సంబంధించిన సమస్యల పట్ల పోరాటాలు చేసి సాధించిన చరిత్ర మాదిగ దండోరాదే నని అన్నారు. గుండే జబ్బు పిల్లల కోసం, వికలాంగుల. పెన్షన్, వృద్ధులు వితంతువులు కోసం, ఒంటరి మహిళల కోసం, ఎస్సీ ఎస్టీ, ఉద్యోగులకు. ప్రమోషన్లలో రిజర్వేషన్ కోసం ఇలా, పోరాటాలు చేసి సాధించిన చరిత్ర ప్రపంచంలో ఏ సంఘానికి లేదని , అలాంటి ఎం ఆర్ పి ఎస్ చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణను సామాజిక కోణంలో ఆలోచించి ఎస్సీ వర్గీకరణ కు మద్ధతు ఇవ్వాలని ప్రజా సంఘాలను, వివిధ రాజకీయ పార్టీలను కోరారు . ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పస్కా నర్సయ్య, మైలారం బాలు ఎం ఆర్ పి ఎస్ మాజీ జిల్లా అద్యక్షులు, గంగని స్వామి. మాదిగ మహసేనా జిల్లా అద్యక్షులు, కౌన్సిలర్ రింగుల భూషణ్, ఎల్ టి కుమార్ మైదం బాజన్న , బచ్చాపల్లి దేవయ్య, మెతరి సాయన్న, చేపూర్ మాజీ సర్పంచ్ టి సి సాయన్న, సర్బిర్యాల్ మాజీ సర్పంచ్ గణేష్,డినర్సింలు, మాదిగ ఉద్యోగుల నాయకులు టీచర్ పోషన్న, కలిగోట సాయన్న, మైలారం గంగాధర్, నల్ల అంజయ్య, జంగం అశోక్, ఎర్రోళ్ల మల్కన్న, తిరుపతి, విప్లవ్, తదితరులు పాల్గొన్నారు.