– ఐర్లాండ్‌పై 304 పరుగుల తేడాతో గెలుపు రికార్డు
– వన్డే సిరీస్ 3-0తో భారత్ క్లీన్‌స్వీప్
రాజ్‌కోట్: భారత మహిళల జట్టు వన్డేల్లో సరికొత్త రికార్డుల నమోదు చేసింది. రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మూడో, చివరి వన్డేలో అత్యధిక స్కోర్ నమోదు చేయడంతోపాటు, అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 435పరుగులు చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోర్. అలాగే ఐర్లాండ్‌పై 304పరుగుల భారీ తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించడం కూడా ఇదే తొలిసారి. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను స్మృతి మంధాన సేన 3-0తో చేజిక్కించుకొని క్లీన్‌స్వీప్ చేసింది. 2017లో ఐర్లాండ్‌పైనే భారత మహిళల జట్టు 249 తేడాతో నెగ్గింది. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఓపెనర్లు మంధాన, ప్రతీకా రావల్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 233 పరుగులు జోడించారు. మంధాన వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసింది. 70 బంతుల్లో సెంచరీ కొట్టింది. ఓవరాల్‌గా 80 బంతుల్లో 12ఫోర్లు, 7సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ప్రతీకా రావల్.. వన్డేల్లో తొలి సెంచరీ. ఆమె 129 బంతుల్లో 20ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 154పరుగులు చేసింది. ఆ తర్వాత ధాటిగా ఆడే క్రమంలో రీచా ఘోష్(59) అర్ధసెంచరీతో మెరిసినా.. తేజల్(28), హర్లిన్(15) త్వరగా పెవీలియన్‌కు చేరారు. దీంతో టీమిండియా 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 435పరుగుల రికార్డు స్కోర్‌ను నమోదు చేసింది. ఐర్లాండ్ బౌలర్లు ప్రెండెర్‌గ్వెస్ట్ రెండు, కెల్లె, సర్జెంట్, డెంసే ఒక్కో వికెట్ పడగొట్టారు.
పదో సెంచరీ.. అత్యంత వేగంగా.. :
తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన స్మృతి మంధాన కెరీర్‌లో పదో సెంచరీని పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన శతకం బాదిన బ్యాటర్‌గా నిలిచింది. కేవలం 70 బంతుల్లోనే ఈ మార్క్‌ను అందుకొంది. మరోవైపు ప్రతీకా రావల్ తొలి సెంచరీని 100 బంతుల్లో సాధించింది. తొలి వికెట్‌కు మంధాన-ప్రతీకా రావల్ జోడీ 233 పరుగులు రాబట్టారు. మహిళల వన్డే చరిత్రలో ఆరో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలిచింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీప్తి శర్మ(3/27), తనూజ(2/31)కి తోడు టిటాస్ సద్ధు, సయాలి, మిన్ను మణి ఒక్కో వికెట్‌తో రాణించారు. ఐర్లాండ్ ఓపెనర్ ఫ్రోబెస్(43), ప్రెండెర్‌గ్వైస్ట్(36) టాప్‌స్కోరర్స్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ప్రతికా రావల్‌కు దక్కాయి.
స్కోర్‌బోర్డు :
ఇండియా మహిళల ఇన్నింగ్స్: ప్రతిక రావల్ (సి)డెంసే (బి)ఫ్రేయా సర్జెంట్ 154, స్మృతి మంధాన (సి)కానింగ్ (బి)ప్రెండెర్‌గ్వెస్ట్ 135, రీచా ఘోష్ (బి)అరియానే కెల్లె 59, తేజల్ హసబ్నిస్ (సి)లారా (బి)ప్రెండెర్‌గ్వెస్ట్ 28, హర్లిన్ డియోల్ (సి)ప్రెండెర్‌గ్వెస్ట్ (బి)జార్జియానా 15, జెమీమా రోడ్రిగ్స్ (నాటౌట్) 4, దీప్తి శర్మ (నాటౌట్) 11, అదనం 29. (50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 435పరుగులు.
వికెట్ల పతనం: 1/233, 2/337, 3/387, 4/415, 5/410
బౌలింగ్: ప్రెండెర్‌గ్వెస్ట్ 8-0-71-2, కానింగ్ 8-0-64-0, కెల్లె 7-0-66-1, ఫ్రెయా సర్జెంట్ 8-0-68-1, జార్జియానా డెంసే 10-0-65-1, డైజెల్ 3-0-28-0, లారా డెలానే 6-0-59-0
ఐర్లాండ్ మహిళల ఇన్నింగ్స్: ఫోర్బెస్ (రనౌట్) దీప్తి 41, లెవీస్ (ఎల్‌బి)టిటాస్ సద్ధు 1, కర్టీ రెలె (బి)సయాలీ 0, ఓర్లా ప్రెండెర్‌గ్వెస్ట్ (బి)తేజల్ కన్వార్ 36, లారా డెలానీ (బి)దీప్తి 10, లెV్‌ా పాల్ (సి అండ్ బి)దీప్తి 15, ఆరియానే కెల్లె (సి)సర్ఘేట్ (బి)తేజల్ కన్వార్ 2, కానింగ్ (బి)మిన్ను మణి 2, డెంసే (రనౌట్)తనూజ/రీచా 0, డాల్జెల్ (నాటౌట్) 5, సర్జెంట్ (సి)మిన్ను మణి (బి)దీప్తి 1, అదనం 18. (31.4ఓవర్లలో ఆలౌట్) 131పరుగులు.
వికెట్ల పతనం : 1/18, 2/24, 3/80, 4/100, 5/115, 6/122, 7/122, 8/122, 9/128, 10/131
బౌలింగ్: టిటాస్ సద్ధు 4-1-22-1, సయాలి సత్ఘారే 4-0-24-1, తనూజ కన్వార్ 9-2-31-2, దీప్తి శర్మ 8.4-2-27-3, మిన్ను మణి 6-0-22-1.
మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోర్లు…
1. న్యూజిలాండ్ 494/1 : ఐర్లాండ్‌పై,డంబ్లిన్(2018)
2. న్యూజిలాండ్ 455/5 : పాకిస్తాన్‌పై, క్రైస్ట్‌చర్చ్(1997)
3. న్యూజిలాండ్ 440/3 : ఐర్లాండ్‌పై,డంబ్లిన్(2018)
4. ఇండియా 435/5 : ఐర్లాండ్‌పై, రాజ్‌కోట్(2025)
5. న్యూజిలాండ్ 418 : ఐర్లాండ్‌పై, డంబ్లిన్(2018)