– హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 383/5
హైదరాబాద్ : తన్మయ్ అగర్వాల్ (164, 192 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), తిలక్ వర్మ (101, 135 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. రోహిత్ రాయుడు (59) సైతం రాణించటంతో నాగాలాండ్‌తో రంజీ ట్రోఫీ ప్లేట్ సెమీఫైనల్లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా సాగుతుంది. తొలి రోజు 90 ఓవర్లలో 5 వికెట్లకు 383 పరుగులు చేసింది. నితీశ్ రెడ్డి (21), ప్రజ్ఞరు రెడ్డి (12) అజేయంగా ఆడుతున్నారు. నాగాలాండ్ బౌలర్లలో జొనాథన్ (2/88) రాణించాడు.