గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో వివిధ రాష్ట్రాల జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులకు, జెడ్పిటిసి సభ్యులకు జరుగుచున్న శిక్షణ శిబిరంలో కామారెడ్డి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు శ్రీ రాజన్ సింగ్ వివిధ అంశాలపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యాలయ నిర్వహణ అధికారులకు, జడ్పిటిసి లకు సూచనలు సలహాలు అందించారు. కామారెడ్డి నుండి సీఈఓ చందర్ తో పాటు కామారెడ్డి జిల్లా పరిషత్ లోని కొందరు ముఖ్య సిబ్బంది వెళ్లారు.