– పాతపంటల జాతరకు తరలిన తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులు
నవతెలంగాణ-కొడంగల్
చిరుధాన్యాలే అందరూ తినాలని వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని పాతపంటల జాతరకు తరలిన తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులు అన్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని జహీరాబాద్ డీడీఎస్ దక్కన్ డెవలమెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ పాత పంటల జాతరకు తరలి వెళ్ళిన తెలంగాణ విద్యావంతుల వేదిక బృందం కవయిత్రి మొల్ల కళావేదిక తాండూర్ టీమ్ మెంబర్స్ జాతర మహౌత్సవాన్ని సందర్శించారు. 24 సంవత్సరాల నుండి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఎడ్లబడిన జాతర కార్యక్రమం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ జాడిమల్కాపూర్ గ్రామంలో నిర్వహించిన జాతర ఉత్సవానికి ముఖ్యఅతిథిగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ రుక్మిణితో పాటు సంఘ ప్రతినిధులు చంద్రవ్వ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాత పంటల ప్రదర్శన ఎడ్లబండ్ల జాతర కోలాటం నిర్వహించారు ఆనాటిపాత పంటలు కనుమరుగవుతున్న నేపథ్యంలో చిరుధాన్యాలు పండిస్తూ ప్రదర్శిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి చిరుధాన్యాలే అందరూ తినాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, గౌరారం గోపాల్, కవిత్రి ముల్ల, కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు కెవిఎం.వెంకట్, ప్రధాన కార్యదర్శి వెంకట్, వంశరాజ్ మెంబర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.