మహమూద్ పాషాకు ప్రశంసాపత్రం అందజేత 

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
మండల పరిధిలోని జాకారం గ్రామం ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకృతి ప్రేమికులు, ఫ్రూటేరియన్ షేక్ మహమూద్ పాషాకు శనివారం పలువురు నాయకులు, పోలీసుల చేతుల మీదుగా స్థానిక పీలా రామకృష్ణ మెమోరియల్ జీవరక్షిత సంఘం నాయకులు గుండె బోయిన రామకృష్ణ ప్రశంసాపత్రాన్ని అందజేసి, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహమూద్ పాషా మాట్లాడుతూ.. జంతుబలి, జంతు హింసలను విడనాడి మూగజీవాల పట్ల ప్రేమను చూపే వారికి ఈ పీలా రామకృష్ణ మెమోరియల్ జీవరక్షిత సంఘం ప్రశంసాపత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తను గత ఏడాదిన్నర కాలంగా మాంసాహారం తినడం పూర్తిగా త్యజించడం జరిగిందని చెప్పారు. దానికి గాను ఈ ప్రశంసాపత్రం ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళపల్లి కోఆపరేటివ్ డైరెక్టర్ సయ్యద్ హఫీజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరబోయిన సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ ఎం.కృష్ణమూర్తి, కానిస్టేబుల్ శివ, తదితరులు పాల్గొన్నారు.