అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
కేజీబీవీ కళాశాలలో, పాఠశాలల్లో బోధించేందుకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం డీఈఓ కార్యాలయంలో సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. కేజీబీవీ సెక్టోరల్‌ అధికారి ఉదయశ్రీ అభ్యర్థుల సర్టిఫికెట్‌లను పరిశీలించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా సెక్టోరల్‌ అధికారి మాట్లాడుతూ కేజీబీవీ కళాశాల, పాఠశాలలో బోధన సిబ్బందిని నియమించేందుకు ఇటీవల నోటిఫికేషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు. దరఖాస్తులు అభ్యర్థుల నుంచి 1 పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ల వేరిఫికేషన్‌కు పిలవడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం మిగిలిన క్యారిఫార్వర్డ్‌ 13 పోస్టులు మినహా మిగలిన 7 పోస్టులకు దరఖాస్తులను స్వీకరించామని అన్నారు. వెరిఫికేషన్‌ అనంతరం కమిటీ అభ్యర్థులను ఫైనల్‌ చేస్తుందని తెలిపారు. ఫైనల్‌ అయిన వారికి రెండు రోజుల్లో అర్డర్‌ కాపీలు ఇస్తామని స్పష్టం చేశారు.