– ఎన్పీడీసీఎల్ ఎస్సీ మల్సూర్
నవతెలంగాణ -తాడ్వాయి : “గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్లు ఉచితంగా పొందేందుకు గాను విద్యుత్ వినియోగదారులు రేపటి నుంచి మీ ఇంటి వద్దకు వచ్చే మీటర్ రీడరు(బిల్లు కొట్టే వారికి) నమోదు చేసుకునే వారికి.. రేషన్ కార్డు (బియ్యం కార్డు), ఆధార్ కార్డులను చూపించి మీ యొక్క సర్వీస్ నెంబర్కు అనుసంధానం చేయుటకు సహకరించాలని ఎన్పీడీసీఎల్ ఎస్సీ మల్సూర్ నాయక్ తెలిపారు. గురువారం మేడారంలో విలేకరులతో మాట్లాడుతూ గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్లు ఉచితంగా పొందేందుకుగాను విద్యుత్ వినియోగదారులు పైన పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అనివార్య కారణాల వలన సిబ్బంది రానప్పుడు, మీ దగ్గరలోని అందుబాటులో ఉన్న విద్యుత్ సహాయ ఇంజనీర్ కార్యాలయంలో గాని లేదా, విద్యుత్ సహాయ గణక అధికారి కార్యాలయంలో వివరాలను ధ్రువీకరించుకోవాలని తెలిపారు. దీనిని విద్యుత్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.