ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత

నవతెలంగాణ – రామారెడ్డి
మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రథమ్ సృజనాత్మకత వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ట్, సైన్స్, మ్యాస్, మ్యూజిక్, నృత్యం పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. విద్యార్థులు సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధు శ్రీవాత్సవ, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.