– ప్రజల ఆస్తి… ప్రభుత్వానికి అప్పగింత
– అమాత్యుడి దగ్గర మెప్పు పొందడం కోసమే…
– ఇప్పటికే అద్దె రూపంలో సెస్ 1.68 కోట్లు చెల్లించిన ప్రజాధనం
నవతెలంగాణ – సిరిసిల్ల
రాష్ట్రంలోనే ఏకైక సహకార విద్యుత్ సరఫరా సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉండగా దానికి సంబంధించిన స్టోర్ స్థలం గత పాలకవర్గం అత్యుత్సాహం. అధికారుల నిర్లక్ష్య నిర్ణయంతో ప్రభుత్వం తీసుకుంది. ఇది ప్రజల ఆస్తి కావడంతో ప్రజలు నష్టపోయారు సెస్ స్టోర్ లో ఉండే కోట్ల విలువైన సామాగ్రి అద్దె స్థలంలో ఉంచడంతో అవి పనికిరాకుండా పోతున్నాయి. వినియోగదారులకు మెరుగైన నిరంతర విద్యుత్తు సరఫరాకు నియంత్రికలు విలువైన సామాగ్రిని భద్రపరిచే స్టోర్ ను పట్టించుకునేవారు కరువయ్యారు. గత ఏడేళ్ల క్రితం సెస్ స్టోర్ కు సంబంధించిన స్థలం గత ప్రభుత్వం మార్కెట్ కోసం తీసుకుంది ఇది ప్రభుత్వ స్థలం కాదు. ప్రజలకు సంబంధించిన స్థలం అయినప్పటికీ అప్పటి పాలకవర్గం తో పాటు అధికారులు ప్రభుత్వంకు అప్పగించారు. జిల్లాలో వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమయ్యారు వ్యవసాయానికి గృహాలకు ఉపయోగించే విద్యుత్ తీగల సవరణ… అదనపు ట్రాన్స్ఫార్మర్లు అమర్చేందుకు ఇదే అనువైన సమయం వీటికోసం జిల్లా వ్యాప్తంగా సెస్ విద్యుత్ వినియోగదారులు పరికరాల కోసం సిరిసిల్లకు రావాల్సిందే. గతంలో సెస్ స్టోర్ పట్టణం నడిబొడ్డున ఉండేది రైతులకు కూడా ఇబ్బంది కాకుండా ఉండేది ప్రస్తుతం అది సాయి నగర్ లో అద్దె స్థలంలో ఉంది అక్కడకు వెళ్లడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు
ఇప్పటికే1.68 కోట్లు అద్దె చెల్లించిన సెస్..
పట్టణంలోని సాయి నగర్ ప్రాంతంలో నెలకు 80 వేలు అద్దె చెల్లించి స్టోర్ ను ఉంచారు. అంతేకాకుండా వేములవాడ అర్బన్ బోయినపల్లి రుద్రంగి ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి తంగళ్ళపల్లి గంభీరావుపేట మండలాల్లో సెస్ భవనాలకు అద్దె చెల్లిస్తున్నారు. ప్రతినెల సెస్ కార్యాలయం నుంచి 2 లక్షలు అద్దె రూపంలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. అంటే ఏడాదికి రూ.24 లక్షలు కాగా ఈ ఏడేళ్లకు రూ.1.68 కోట్లు ప్రజాధనం అద్దె రూపంలో చెల్లించింది. ఇది ప్రజాధనం కాగా గత పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు భరించాల్సి వస్తుంది. వేములవాడ అర్బన్ ఎల్లారెడ్డిపేట తంగళ్ళపల్లి రుద్రంగి వీర్నపల్లి ప్రాంతాల్లో సెస్ భవన నిర్మాణాలకు స్థలం కూడా లేదు. ప్రభుత్వం ఈ ప్రాంతాలకు స్థలం మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల స్టోర్ కు సంబంధించిన ఐదు ఎకరాల స్థలం తో పాటు రెండు షెడ్లు మార్కెట్ కోసం తీసుకోగా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సెస్ కు సంబంధించిన భవనం ఉండగా, అది పోలీస్ స్టేషన్కు వాడుకుంటున్నారు. ఇప్పటివరకు తిరిగి ఇవ్వకపోగా, వారికి స్థలం కూడా ఇవ్వడం లేదు. ఇవి ప్రజలకు సంబంధించిన ఆస్తులు అయినప్పటికీ ప్రభుత్వం తీసుకుంది. వెంటనే ప్రభుత్వం ఈ స్థలాలు ఇవ్వాలని విద్యుత్ వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
అద్ద స్థలంలో కొనసాగుతున్న సెస్ స్టోర్ లో దాదాపు పది కోట్లకు పైగా విలువైన విద్యుత్ సామాగ్రి ఉంటుంది. మానేరు వాగు సమీపంలోని స్టోర్స్ స్థలాన్ని మార్కెటింగ్ శాఖ రైతు బజార్ నిర్మాణానికి కేటాయించారు. పట్టణంలోని బివై నగర్ లోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయం గోదామును సర్దాపూర్ లో కొత్తగా నిర్మించిన మార్కెట్ యార్డుకు తరలించారు. ఇక్కడ ఖాళీగా ఉన్న మార్కెటింగ్ శాఖ గోదాం ఖాళీ స్థలం సెస్ స్టోర్ కు అనుకూలంగా ఉంటుందని అధికారులు భావించారు. రైతు బజార్ కు కేటాయించిన స్థలానికి బదులుగా పట్టణంలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయం సెస్ స్టోర్ కు కేటాయించాలని అప్పటి మంత్రి కేటీఆర్ దృష్టికి సెస్ అధికారులు తీసుకువెళ్లారు. అయినా ఆ స్థలం సెస్ స్టోర్ కు ఇవ్వలేదు ప్రస్తుతం ఆపేరల్ పార్క్ లో ఉన్న రెండు షెడ్లు సెస్ స్టోర్ కు ఇవ్వాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు జిల్లా కలెక్టర్ తో పాటు ప్రభుత్వానికి నివేదించారు ప్రస్తుత ప్రభుత్వం పరిశీలించి సెస్ స్టోర్ కు ఇప్పటికైనా స్థలం కేటాయించి, కోట్ల విలువైన విద్యుత్ సామాగ్రి ని కాపాడి ప్రజా ధనం దుర్వినియోగ కాకుండా చూడాలని విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.