ఈ నేల 7 న సీజీఇర్ఎఫ్..

– హాజరు కానున్న చైర్మన్ వేణుగోపాలా చారీ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 7 వ తేదీ మంగళవారం మండల పరిధిలోని వినాయక పురం విద్యుత్ సబ్ స్టేషన్  ప్రాంగణంలో లో  విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం వేదిక ను నిర్వహించనున్నట్లు ఎన్పీడీసీఎల్  ఏఈఈ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సీజీఆర్ఎఫ్ (కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రాసల్ ఫోరం – విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక) చైర్మన్ హాజరు అవుతారని తెలిపారు. దమ్మపేట,అశ్వారావుపేట సబ్ స్టేషన్ పరిధిలో అన్ని రకాల విద్యుత్ వినియోగదారులు వారి సమస్యలు ఈ వేదిక దృష్టికి తెచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.