
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ నూతన కమీషనర్ గా చాహత్ బాజ్‌పాయ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మున్సిపల్ ఇంచార్జి కమీషనర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రఫుల్ దేశాయ్ స్థానంలో చాహత్ బాజ్‌పాయ్ భాద్యతలు తీసుకోనున్నారు. గతంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా, సబ్ కలెక్టర్‌గా పని చేసిన ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఏఎస్ క్యాడర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ క్యాడర్‌కు గత సంవత్సరం మార్చి 2న బదిలీ అయ్యారు. తెలంగాణ కు కేటాయించిన తరువాత మొదటి పోస్టింగ్ కొమురం భీం అసిఫ్ నగర్ అిషనల్ కలెక్టర్ గా , ఉట్నూర్ ( ITDA ) ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. గత జులై నుండి అక్రమార్కుల పట్ల ఉక్కు పదం మోపుతూ, నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న తరుణం లో కార్పోరేషన్ కు నూతన కమీషనర్ నియామకం ఆసక్తికరంగా మారింది.