వైరా లో మళ్లీ చైన్ స్నాచింగ్

నవతెలంగాణ- వైరా: వైరాలో మళ్లీ చైన్ స్నాచింగ్. ప్రభుత్వ ఆసుపత్రి హెచ్ సి ఓ పై పట్ట పగలు దాడి. నాలుగు తులాల బంగారు గొలుసు అపహరణ.   ప్రభుత్వ ఆసుపత్రి హె సి ఓ ధనలక్ష్మి మంగళ వారం ఉదయం చైన్ స్నాచర్ దాడికి గురైయ్యారు. ఆమె అద్దెకు ఉంటున్న అపార్ట్ మెంట్ నుండి నడుచుకుంటూ ఆసుపత్రికి వెళుతున్న సమయంలో ఒక యువకుడు మోటారు సైకిల్ వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కుని వెళ్ళాడు .తొలుత ఆమె వెనక వైపు నుండి ముందుకు వెళ్లి వెంటనే వెనక్కు మళ్ళీ అతి వేగంగా ఆమెను సమీపించి గొలుసు లాక్కెళ్లి నట్లు ఆమె తెలిపారు.మోటారు సైకిల్ తో డ్యాష్ ఇచ్చే వాడిలా వచ్చాడని అందుకు భయపడి ప్రక్కకు తప్పుకుంటున్న సమయం లో గొలుసు లాగేసునట్లు తెలిపారు. ఆస్పత్రి వైద్యురాలు తాతా ఉదయలక్ష్మి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయగా ఎస్ ఐ మేడా ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని చైన్ స్నాచర్ల ఫోటోలు చూపించగా గొలుసు లాక్కెళ్లి న వ్యక్తిని గుర్తుపట్టి నట్లు తెలిపారు.ధనలక్ష్మి పోలీసులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.