వేములవాడ మున్సిపల్ పరిధి లోని ఎంపీడీవో కార్యాలయం పక్కన నిర్మిస్తున్న పార్క్ పనులను గురువారం చైర్మన్, కమిషనర్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ఎంపీడీవో ఆఫీస్ పక్కన గల నిర్మిస్తున్న పార్కును సందర్శించిన క్రమంలో వీటీడీఏ నిధులు 2 కోట్ల రూపాయలు వెచ్చించి మున్సిపల్ పర్యవేక్షణలో నిర్మిస్తున్న ఎంపీడీవో ఆఫీస్ పక్కన గల పార్కు పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని ఆమె తెలిపారు. ప్రజలకు పిల్లలకు, వాకర్స్ కు ఆహ్లాదకరంగా ఉండేందుకు గతంలో మూల వాగు పక్కన పార్కును నిర్మించుకోవడం జరిగిందని ప్రజలకు మరింత దగ్గరగా అందుబాటులో ఉండే విధంగా పట్టణం నడి ఒడ్డున ఎంపీడీవో ఆఫీస్ పక్కన పార్కును ఏర్పాటు చేయాలని మా పాలకవర్గం తరఫున గతంలో ఉన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి విన్నవించడం జరిగిందని తెలిపారు. అధికారులతో మాట్లాడి స్థలం, నిధులు శాంక్షన్ ఇవ్వడంతో పట్టణం లోని ఎంపీడీవో ఆఫీస్ పక్కన ప్రజలకు పిల్లలకు వాకర్స్ కు అందుబాటులో ఉండేవిధంగా ఈ పార్కు ను నిర్మించుకోవడం జరిగిందని వారన్నారు.అతి త్వరలోనే మిగతా పనులు పూర్తయిన తరువాత శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా పార్కు ను ప్రారంభం చేసుకొని అందుబాటు లోకి రానున్నదని ఆమె తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధి లోని ఎంపీడీవో ఆఫీస్ పక్కన నిర్మిస్తున్న పార్క్ పనులను కమిషనర్ తో కలిసి పరిశీలించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.