
పట్టణ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయంలోని సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్ సమస్యను వారంలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పురుషులకు మహిళలకు వేరువేరుగా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాల సెక్రటరీ బుగ్గారెడ్డి తో ఫోన్లో మాట్లాడి కనీస వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంథాలయంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా బిల్డింగ్ కాంట్రాక్టర్ తో మాట్లాడి త్వరగా బిల్డింగ్ ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రంథాలయంలో త్వరలోనే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఆయనను మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, లైబ్రేరియన్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.