నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం హాలియ మున్సిపాలిటీ పరిధిలో గల ముదిరెడ్డి శివారెడ్డి -మల్లేశ్వరి ల నూతన గృహప్రవేశానికి గురువారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై నూతన గృహం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, మాజీ యంపిపి, తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,వంగాల భాస్కర్ రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, గజ్జల శివానంద రెడ్డి, ఇస్రం లింగస్వామి, చామల మధుసూదన్ రెడ్డి,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి,బిపిఆర్ వైడిఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్, కోడుమూరి నారాయణ రెడ్డి, అబ్దుల్ కరీం,బుసిరెడ్డి మట్టారెడ్డి, శ్రీధర్ రెడ్డి,చలకుర్తి ప్రజలు,నెల్లికల్లు ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.