వధువు పెళ్లికి  ఆర్థిక సహాయం అందజేసిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్

నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమానూరు మండలం  సూరేపల్లి గ్రామ వాస్తవ్యులు అయినటువంటి కొండేటి సోమయ్య పేద కుటుంబం కావడం తో సోమయ్య కూతురు శోభ  పెళ్లి నిమిత్తం అవసరాలకు శనివారం బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్, శ్రీ వైష్ణవి కన్స్ట్రాక్షన్స్ బుసిరెడ్డి పాండు రంగారెడ్డి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా సోమయ్య తన కూతురి శుభలగ్న పత్రికను బుసిరెడ్డి పాండురంగారెడ్డి  ఇచ్చి వివాహ మహోత్సవానికి సాదరంగా ఆహ్వానం అందిచారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, అబ్దుల్ కరీం, గాలి నరేందర్ రెడ్డి, వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.