అంత్యక్రియలకు భోజనాలు పంపించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్


నవతెలంగాణ -పెద్దవూర: నల్గొండ జిల్లా ,నాగార్జునసాగర్ నియోజకవర్గం, నిడమానూరు మండలం, వెనిగండ్ల గ్రామానికి చెందిన ముదిగొండ కృష్ణమ్మ అనారోగ్యంతో ఆదివారం స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుకొని ఆ కుటుంబానికి చేయూతగా బుసిరెడ్డి పాండురంగారెడ్డి అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు.సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరారు.