దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఎం వెంకటేశ్వరరావు ఆదివారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు సాధన స్వాగతం పలికి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. స్వామివారికి అతి ప్రీతిపాత్రమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో చైర్మన్ దంపతులకు ఆలయ ఈఓ కె.వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించారు.వీరి వెంట ఏ ఈ ఓ లు బ్రహ్మన్న గారి శ్రీనివాస్, ప్రతాప నవీన్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఆలయ పరిరక్షకులు, అలీ శంకర్ ఆలయ ఇన్స్పెక్టర్ సంకపల్లి పవన్ ,ఈవో సిసి ఎడ్ల శివ సాయి తదితరులు ఉన్నారు.