నవతెలంగాణ – శంకరపట్నం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి కోసం పాలకవర్గ సభ్యులతో పాటు సంఘ సభ్యులు తమ వంతు కృషి చేసినారని మెట్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పొద్దుటూరి సంజీవరెడ్డి, కోరారు. శుక్రవారం శంకరపట్నం మండల పరిధిలోని మెట్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సంజీవరెడ్డి అధ్యక్షతన చింతలపల్లి గ్రామంలో సంఘం కొనుగోలు చేసిన ఆవరణలో సంఘం మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి శనిగరపు సదయ్య,సమావేశాన్ని నిర్వహించి సంఘం 2023/2024 సంవత్సరము ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా చైర్మన్,సంజీవరెడ్డి,మాట్లాడుతూ, బ్యాంకులో ఎవరైనా సకాలంలో అప్పులు చెల్లించని యెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆముదాలపల్లి గ్రామంలోని పెట్రోల్ పంపు సక్రమంగా జరిగే విధంగా అందరూ కృషి చేయాలని ఆయన కోరారు.ఇదే గ్రామంలోని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం కొరకు ఎమ్మెస్సీ పథకం కింద ప్రతిపాదనలు పంపినట్లు,తెలిపారు. చింతలపల్లి గ్రామంలో గోదాము నిర్మించడం కొరకు 5 గుంటల స్థలం కొనుగోలు చేసినామని తెలిపారు. త్వరలోనే పనులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అంతం రవీందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు,బొడ సంపత్,మాడ రాజిరెడ్డి,కవ్వ పద్మ, కాల్వ రమణారెడ్డి, బత్తుల రవి,వివిధ గ్రామాలకు చెందిన సంఘ సభ్యులు, వాటాదారులు తదితరులు పాల్గొన్నారు.