కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట భూచ్చన్న ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద ఇటీవల కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్ గా నియమితులైన పాలేపు నర్సయ్య, సుంకేట భూచ్చన్న లను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు వరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడగేల ప్రవీణ్, మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు గుడిసె అంజమ్మ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, నాయకులు బుచ్చి మల్లయ్య, వేముల గంగారెడ్డి, ఊట్నూరి ప్రదీప్, పూజారి శేఖర్, మోహన్ నాయక్, సల్లూరి గణేష్ గౌడ్, సుంకేట శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ గౌరవ అధ్యక్షులు అబ్దుల్ రఫీ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.