భువనగిరి మండలం పరిధిలోని అనంతారం చౌరస్తా వద్ద కొన్ని సంవత్సరాల నుండి భువనగిరి మున్సిపల్ కి సంబంధించి కృష్ణ వాటర్ పైప్లైన్ లీకేజీ అవుతుందని అనంతారం గ్రామస్తులు డయల్ యువర్ చైర్మన్ ప్రోగ్రాం లో ఫిర్యాదు చేయడంతో చైర్మన్, కమిన్షనర్ వెంటనే స్పందించి మరమత్తులు చేయించినట్లు తెలిపారు. ఈ మున్సిపల్ చైర్మన్ పోత్తంశెట్టి వెంకటేశ్వర్లు, కార్యక్రమంలో కమిషనర్ రామంజుల రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ కూర వెంకటేశ్, అనంతారం మాజీ ఉపసర్పంచ్ విఠల్.వెంకటేశ్, మహేష్, పాండు, వంశి లు పాల్గొన్నారు.