గణతంత్ర వేడుకల్లో చైర్మన్ సంగమేశ్వర్..

నవతెలంగాణ- మద్నూర్

మద్నూర్ మార్కెట్ కమిటీ అభివృద్ధికి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రత్యేక కృషి చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం నాడు కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి అలాగే వ్యవసాయదారులకు అన్ని రకాల సహాయ సహకారాలు ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు. మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకలకు ప్రత్యేకంగా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ విట్టల్ సూపర్వైజర్ సత్యం మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యేతో వచ్చిన వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.