మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్

Chairman SC and ST Commission visited Mallareddy's familyనవతెలంగాణ – తొగుట
మల్లారెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. శుక్ర వారం మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ సొసైటీ చైర్మన్ ఎన్నం మల్లారెడ్డి కుమారులు మహిపిక్సలు మహి పాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లను పరామర్శించారు. సర్పంచ్ గా, సొసైటీ చైర్మన్ గా ఆయన చేసిన సేవలు మరువలేమని కొనియాడారు. రాజకీయా లకు అతీతంగా అందరితో చనువుగా మెదిలే వారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మర ణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం గ్రామంలో ఇటీవల మరణించిన జూపల్లి సత్తయ్య కుటంబాన్ని పరామర్శించారు. పరామర్శించిన వారిలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడి పల్లి రాంరెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, నాయకులు జానారెడ్డి, గోవిం ద రెడ్డి, పాత్కుల బాలేష్, ఎన్నం యాదవ రెడ్డి, పులిందర్ రెడ్డి, స్వామి గౌడ్, మంగలి బాలరాజు తదితరులు ఉన్నారు.