నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య వర్ధ్ధంతిని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన చిత్ర పటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమురయ్య పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, సీఎల్పీ కార్యాలయ కార్యదర్శి శ్రీకాంత్, చీఫ్ మార్షల్ కరుణాకర్, ఉభయ సభల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.