గ్రంథాలయాన్ని సందర్శించిన చైర్మన్

Chairman visited the libraryనవతెలంగాణ – రెంజల్ 
మండల కేంద్రమైన రెంజల్ గ్రంధాలయాన్ని ఆదివారం జిల్లా గ్రంథాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి ఆకస్మికంగా తరిమిచేసి రికార్డులను పరిస్థితినించారు. మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం జరుగుతూ ఉండడంతో, మండల పరిషత్ కాంప్లెక్స్ లో కొనసాగుతున్న గ్రంధాలయాన్ని ఆయన సందర్శించారు. గ్రంథ పాలకుడు విధ నిర్వహణలో లేకపోవడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయం సమయపాలన పాటిస్తూ యువతకు ఆదర్శంగా ఉండాలని ఆయన సూచించారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అన్నిటిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. నేటి సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, గ్రంథాలయాలు ఇట్టి యువతకు ఎంతో ఉపయోగకరంగా మారుతాయని ,వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలోనే గ్రంథాలయ భవన నిర్మాణం పూర్తయ్యాల చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట బీసీ సెల్ మండల అధ్యక్షులు లచ్చేవార్ నితిన్, సీనియర్ నాయకులు సాయిబాబా గౌడ్, బోడిగ రవి, ఎల్ కష్ణ, సల్మాన్ ఖాన్, శివ, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.