నమస్తే స్కీం పై కార్మికులకు అవగాహన కల్పించిన ఛైర్మన్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన నమస్తే స్కీం  పై మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఆకుల రజిత కార్మికులకు నమస్తే స్కీంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రజిత మాట్లాడుతూ సెప్టిక్ ట్యాంక్ వర్కర్లందరూ పురపాలక సంఘం తరఫున లైసెన్స్ తీసుకోవాలని, పి పి ఈ  కిట్ తప్పకుండా ధరించాలని సూచించారు. నమస్తే స్కీమ్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ , రుణాలు కానీ, సబ్సిడీ కింద కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి మీకు ఒక సువర్ణ అవకాశమని తెలిపారు. తప్పకుండా ప్రతి సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్  ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఆన్ లైన్ లో మీ వివరాలన్నీ పొందుపరచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అయిలేని అనిత రెడ్డి, కమిషనర్ మల్లిఖార్జున్, కౌన్సిలర్ గోవిందు రవి, సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం , ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవికుమార్, జవాన్లు సారయ్య ,ప్రభాకర్ మరియు సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు పాల్గొన్నారు.